Sad Demise of Our President Sri PVRK Prasad

Sri PVRK Prasad, IAS (Retd.) President, Bhagavatula Charitable Trust (BCT) passed away this morning around 2.30am in Hyderabad. We are reporting this with heavy hearts from all of us at BCT.

He had been associated with BCT’s Founder Dr. BV. Parameswara Rao since 1968. Sri Prasad garu has always had a deep concern for rural communities and always went out of the way to help BCT, all through his career.

In 2005, Sri Prasad garu became the President of BCT and has been a guiding light all these years. His incisive thinking coupled with vast experience in administration were instrumental in taking BCT further in these 12 years. His passing away leaves a big void which will be difficult to fill. Sri PVRK Prasad

Mr Prasad, an IAS officer of Andhra Pradesh cadre, held several important responsibilities, including Executive Officer of Tirumala Tirupati Devasthanams (TTD) and Chairman of Vizag Port Trust, during his illustrious career. He has been President of Bhagavatula Charitable Trust since 2005.

Under his leadership as Executive Officer during 1978-82 and later as an Advisor post-retirement, the TTD, the body that administers the Lord Venkateswara temple at Tirupati, took up several reforms and important projects.

Sri Prasad garu, who served as Media Advisor to Narasimha Rao, was a close aide of the former Prime Minister. He has authored several popular books in Telugu, including ‘Naham Kartha’, ‘Asalem Jarigindante’ (Wheels behind the veil), ‘Tirumala Leelamrutham’ and ‘Tirumala Charitamrutam’.

He is survived by wife, a daughter and a son.

ఆగస్ట్ 21: భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, విశ్రాంత ఐ.ఎ.ఎస్. అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ (77) అకాల మృతి పట్ల బి.సి.టి. పాలకవర్గం మరియు సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం తెల్లవారు ఝామున గుండెపోటుతో హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ నందు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ సందర్భంగా బి.సి.టి. క్యాంపస్ నందు సంతాప సభ నిర్వహించి ఆయన సేవలను కొనియాడి నివాళులు అర్పించారు. బి.సి.టి. కార్యదర్శి భాగవతుల శ్రీరామ మూర్తి మాట్లాడుతూ పి.వి.ఆర్.కె. మృతి బి.సి.టి. కి మరియు సమాజానికి తీరనిలోటు అని అన్నారు. శ్రీ ప్రసాద్ గారికి గ్రామస్ధుల పట్ల ఆపారమైన జాలి, కరుణ వుండేది. బిసిటి చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి ఎలాగా ఉపయోగపడేటట్టు ఎలా వెళ్ళాలనే సూచనలు ఇచ్చేవారు. వారి అకాల మరణము తీరని లోటు.
శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ ఐ.ఎ.ఎస్. కేడర్ కు చెందిన వారు. ఈయన ఎన్నో ప్రభుత్వ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించిన అనుభవశాలి అని, గొప్ప దార్శనికుడని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు. ఆయన మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారికి మీడియా సలహాదారుగా, అదనపు ప్రభుత్వ కార్యదర్శి గాను గతంలో బాధ్యతలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గాను, సలహాదారు గాను, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గాను బాధ్యతలు నిర్వహించారు. 2005 నుండి భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ (బి.సి.టి.) గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం తిరుపతి లో 60 మంది పీఠాధిపతులను, మఠాధిపతులను సమావేశపరచి హిందూ ధర్మ పరిరక్షణకు ఉద్యుక్తుల్ని చేశారు. ప్రస్తుతం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలలో భజన సంప్రదాయాల కొనసాగింపుకు పూనుకుని, భజన గురువులకు శిక్షణ అందించి భజన సాంప్రదాయాలకు నాంది పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యతలతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకుడిగా స్వామి వారిపై తెలుగులో అనేక పుస్తకాలు స్వయంగా వ్రాసారు. ఆయన వ్రాసిన పుస్తకాలు మంచి ప్రాచుర్యం పొందాయి. ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో “నాహం కర్త”, “అసలు ఏమి జరిగిందంటే”, “తిరుమల లీలామృతం “, “తిరుమల చరితామృతం” మొదలయిన పుస్తకాలు ఉన్నాయి.